Trump: వాళ్లు ఎప్పటికీ నాటో సభ్యులు కాలేరు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ ఎప్పటికీ నాటోలో సభ్యదేశంగా కాలేదని తెలిపారు. అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వైదొలగేందుకు యత్నిస్తే జెలెన్‌స్కీ పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Donald Trump

Donald Trump

నాటోలో తమకు సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో శాంతి వస్తుందంటే అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని.. దీనికి బదులుగా నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలన్నారు. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడారు. వాళ్లు ఎప్పటికీ నాటో సభ్యులు కాలేరని తెలిపారు. అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వైదొలగేందుకు యత్నిస్తే జెలెన్‌స్కీ పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం లభించదని జెలెన్‌స్కీకి అర్థమై ఉంటుందని అందుకే తమతో ఖనిజ వనరుల ఒప్పందంపై చర్చలు జరపాలని అనుకుంటున్నారని ట్రంప్ అన్నారు. పుతిన్‌తో సంబంధాలపై మాట్లాడుతూ.. పలు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా స్నేహపూర్వక బంధం ఉందని పేర్కొన్నారు.  

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్‌ మహిళా మావోయిస్టు మృతి

యుద్ధ ముగింపు విషయంలో  ఆయన తన మాటను కాదనడని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ పుతిన్ తన మాటను కాదంటే రష్యా చమురుపై అదనపు సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. 

 telugu-news | rtv-news | nato | ukraine | russia 

Advertisment
తాజా కథనాలు