TG Crime : తెలంగాణలో నారాయణ స్కూల్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్ పరిధిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లోహిత్ అనే విద్యార్థి హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో 7వ తరగతి హాస్టల్లో వుండి చదువు కొనసాగిస్తు్న్నాడు. Also Read : ఏపీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు దుర్మరణం ఉరివేసుకుని ఆత్మహత్య: రాత్రి హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్ వెళ్లి లోహిత్ వున్న గది తలుపులు కొట్టిన ఎంతకూ తీయక పోవడంతో స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో లోహిత్ గది వద్దకు వచ్చారు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా లోహిత్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. లోహిత్‌ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం లోహిత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లోహిత్ మృతితో కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. Also Read : ఆస్తి కోసం సొంత సోదరులనే.. ఏం చేసిందంటే? స్కూల్ సిబ్బందితో లోహిత్ కుటుంబ సభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగి తమకు న్యాయం చేయాలని స్కూల్ ఎదుట బైఠాయించారు. విద్యార్థి మృతి చెందిన విషయం స్కూల్ సిబ్బంది చెప్పలేదు. పోలీసులు చెప్తేనే తెలిసిందని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇప్పటికి కూడా స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. విద్యార్తి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నాయారణ హాస్టల్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదికూడా చదవండి: జీవితంలో ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి Also Read : భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే..