రెండేళ్ల క్రితం ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చిన కేసులో ఓ నిందితుడికి నాంపల్లి హైకోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం సుధీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థాన మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2022లో నారాయణగూడకు చెందిన సాయిలు అనే వ్యక్తి.. తన భార్య, ఆమె ప్రియుడు, చిన్నారిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు. ఇక సాయులుకు సహకరించిన అతని స్నేహితుడు రాహుల్‌కు కూడా రూ.1000 జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఇక వివరాల్లోకి వెళ్తే.. నారాయణగూడ వంతెన కింద నాగులు సాయిలు, ఆర్తి దంపతులు పూలు అమ్ముకుంటూ జీవిస్తుండేవారు. అయితే వివిధ కారణాల వల్ల సాయిలు, ఆర్తి తరచుగా గొడవ పడేవారు. దీంతో ఆర్తి తన భర్తకు దూరంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే నాగరాజు అనే యువకుడితో ఆర్తికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త సాయిలుకు తెలిసింది. ఈ విషయంపై ఆమెను సాయిలు పలుమార్లు మందలించాడు కూడా. అయినప్పటికీ కూడా ఆర్తి పట్టించుకోలేదు. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు దీంతో వాళ్లపై కక్ష పెంచుకున్న సాయిలు.. భార్య, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో 10 నెలల చిన్నారి కూడా తీవ్ర గాయాలపాలైంది. చికిత్స పొందుతూ ముగ్గురూ కూడా ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఆర్తి తల్లి ఫిర్యాదు మేరకు 2022లో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేశారు. చివరికి దీనిపై కోర్టులో విచారణ జరగగా.. తాజాగా నాంపల్లి హైకోర్టు సాయిలుకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!