BIG BREAKING: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఔట్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంతో అందులో చిక్కకుపోయిన 8 మందిని కాపాడేందుకు రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉంది.
మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
విజయ డెయిరీ పేరుతో మార్కెట్లో నకిలీ పాలను విక్రయిస్తున్నారని డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. విజయ పేరుతో ఎవరైనా నకిలీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడో చిన్న ఆశ...వారు ప్రాణాలతో ఉండి ఉంటారనే ప్రయత్నాలు..కానీ చివరకు నిరాశే మిగిలేలా ఉంది. ఐదు రోజులుగా శ్రీశైలం టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. మట్టి, బురద తప్ప ఇంకేం కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
సూర్యాపేటలో ఓ మహిళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆ మహిళ సూర్యపేటలోని స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా.. గర్భసంచిలో 10 కేజీల గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించారు.
యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. భారీ బండరాళ్ళు కూలిన కారణంగా టీబీఎం, కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి అని ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నారు.