Addanki Dayakar : మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు....ఎమ్మెల్సీ అద్ధంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో నిరసన తెలిపారు. హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.

New Update
Addanki Dayakar Thungathurthy

Addanki Dayakar Thungathurthy

Addanki Dayakarనేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఏయ్ మోడీ.. బ్రిటిష్ వాళ్ళకే భయపడని పార్టీ రా మాది.. మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు అంటూ విమర్శించారు. మోడీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఏంటి రా? 2029లో మోడీని తన్ని జైల్లో వేస్తాం. RSS మోడీ లాంటి దరిద్రపు గొట్టు నాయకుడిని ఈ దేశానికి ఇచ్చింది. మోడీ మేము ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా? అని అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన కుటుంబాన్ని ఈ రోజు కక్షపూరితంగా టార్గెట్ చేయడాన్ని అడ్డకోవాలని, ప్రజలు దీనిపై స్పందించాలని దయాకర్ పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సొంత ఇల్లు లేకపోయినా, దేశానికి త్యాగాలు చేస్తూ సేవ చేస్తున్నారు. అలాంటి వారి పై కుట్రలు చేస్తే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులు ఒక్కటవుతారు,” అంటూ హెచ్చరించారు.

Also Read: Aghori - Sri Varshini: అఘోరీ చేతబడి చేసింది.. వర్షిణి అన్నయ్య హర్ష సంచలన వీడియో వైరల్

2029లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో నుంచి గద్దె దించి తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై జరుగుతున్న కుట్ర దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా తొలగించాలన్న కుట్ర అని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ విద్వేషాలను వ్యాపింపజేస్తుంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అక్రమాలపై ప్రశ్నించే వారిని ఈడీ, ఐటీ దాడులతో బెదిరించేందుకు ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని దయాకర్ హెచ్చరించారు. దేశంలో జరుగుతోన్న అక్రమాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే.. వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న మోడీని పాతాళంలోకి తొక్కేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

Also Read: బాలయ్య బర్త్ డేకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు