/rtv/media/media_files/2025/07/03/kavitha-letter-to-kcr-2025-07-03-17-11-33.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam Case) లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఊరటనిచ్చింది. ఆమె కుమారుడి యూనివర్సిటీ అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు అనుమతించింది. దీంతో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగస్టు 16 నుంచి 15 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు బయల్దేరనున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి సెప్టెంబర్ 1న ఇండియాకు రానున్నారు. అమెరికా వెళ్లే ముందు తండ్రి కేసీఆర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోడానికి శుక్రవారం(ఈరోజు) మధ్యాహ్నం ఆమె ఎర్రవెల్లి ఫాంహౌస్ వెళ్తున్నారు. కొడుకు ఆర్యతో కలిసి కవిత కేసీఆర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోడానికి ఫాంహౌస్‌కు వెళ్తున్నారు.
తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లనున్న కల్వకుంట్ల కవిత గారు
— 𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚𝐤𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 (@KavithakkaUpdts) August 15, 2025
15 రోజుల పాటు అమెరికా పర్యటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత గారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ…
ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ పొందిన కవిత, తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో కవిత తన చిన్న కుమారుడిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేర్చడానికి వెళ్లాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కవిత అభ్యర్థనను పరిశీలించిన న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్, ఆమెకు 15 రోజుల పాటు అమెరికా వెళ్లేందుకు అనుమతినిచ్చారు.
Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
కోర్టు తీర్పులో ముఖ్యాంశాలు
కోర్టు తన తీర్పులో "విదేశాలకు వెళ్లే హక్కు అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మరియు స్వేచ్ఛలో ఒక ముఖ్యమైన భాగం" అని పేర్కొంది. కవిత బెయిల్\u200cపై ఉన్నందున ఆమె పారిపోయే ప్రమాదం లేదని, ఆమె ఒక మాజీ ఎంపీగా సమాజంలో బలమైన మూలాలు కలిగి ఉన్నారని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా, గతంలో కూడా మే నెలలో తన పెద్ద కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. ఆ పర్యటనలో ఆమె కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, విచారణకు ఆటంకాలు కలిగించలేదని కోర్టు గుర్తు చేసింది.
Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?
సీబీఐ, ఈడీ అభ్యంతరాలు
అయితే, కవిత విదేశీ పర్యటన(America Tour) కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అమెరికా వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, విచారణను ఆలస్యం చేయవచ్చని వాదించాయి. అయితే, ఈ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఆమె సకాలంలో తిరిగి వచ్చి విచారణకు సహకరిస్తారని నమ్ముతున్నట్లు కోర్టు పేర్కొంది.