Kavitha : రాజకీయాల్లోకి కవిత కొడుకు.. ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కవిత మద్దతు తెలిపారు

New Update
kavitha son

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(kcr) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) కుమారుడు ఆదిత్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కవిత మద్దతు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read :  తెలంగాణ బంద్ సక్సెస్

ఫ్లకార్డు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి

ఆదిత్య స్వయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ ఫ్లకార్డు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. ఇక కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి నాయకులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆదిత్య కూడా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉండబోతున్నదని తెలుస్తోంది.

Also Read :  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!.. ఆ వివరాలు త్వరలో బహిర్గతం

కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేశారు. 2025 మే నెలలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ హాజరయ్యారు. ఆదిత్య విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు ఆదిత్య. ఇక కవిత చిన్న కొడుకు పేరు ఆర్య. ఉన్నత విద్య చదవడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్ళారు. అతనిని కాలేజీలో చేర్పించడం కోసం కవిత అమెరికా వెళ్లారు. 

Advertisment
తాజా కథనాలు