ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్సీ ఉపవర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ నుంచి భారీ సంఖ్యలో మాలలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని పేర్కొన్నారు. Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు ఊరుకునేది లేదు ''ఆర్టికల్ 341 సవరణ వల్ల మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది. దళితులను ఐక్యంగా ఉంచేందుకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన అంబేద్కర్‌ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదు. తెలంగాణలోని ఉద్యమ సమయంలో పాల్గొన్నప్పుడు నాపై ఈడీ దాడులు జరిగినా భయపడలేదు. నేను కేవలం మంత్రి పదవి కోసం ఈ సభను నిర్వహిస్తున్నానని విమర్శించడం ఎంతవరకు సమంజసమని'' వివేక్ అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కూడా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా మరోవైపు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మాలలు కష్టపడి చదివి, ఉద్యోగావకాశాలు సంపాదించుకున్నవాళ్లే తప్ప ఎవరి అవకశాలను దెబ్బతీయలేదని తెలిపారు. గత 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ మాలలను దొంగల్లా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాలలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కశాతం ఉన్నవాళ్లు మాత్రమే రాజ్యాధికారం చేపడితే అధిక శాతం ఉన్న మాలలు ఎందుకు చేజిక్కించుకోకూడదని ప్రశ్నించారు. అయితే ఈ సభ జరుగుతున్న సమయంలో కాసేపు వర్షం పడి ఆగిపోయింది. అయినా కూడా సభ విజయవంతంగా ముగిసింది. Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం Also Read : పుష్ప-2 ప్రీ రిలీజ్ ఎఫెక్ట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు