Raja Singh : బాంబు పెట్టి లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి  బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.

New Update
rajasingh

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి  బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది. ఆసిఫ్ నగర్‌కు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే పేరుతో ఈ లేఖ అందినట్లు సమాచారం. గతంలోనూ రాజాసింగ్‌కు అనేకమార్లు విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు నేరుగా లేఖ రావడం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది.

నన్ను నువ్వు ఏమీ చేయలేవు

ఆ లేఖలోని సారాంశం అత్యంత ఘాటుగా, సవాలు విసిరేలా ఉంది. "నాకు పోలీసుల మద్దతు ఉంది.. నన్ను నువ్వు ఏమీ చేయలేవు" అంటూ నిందితుడు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, బాంబు పెట్టి ఎమ్మెల్యేను లేపేస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ లేఖ ఎమ్మెల్యే  అందిన వెంటనే ఆయన అనుచరులు, భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

వరుసగా వస్తున్న ఈ బెదిరింపులపై రాజాసింగ్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పదే పదే ఇలాంటి హెచ్చరికలు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖ పంపిన వ్యక్తి వివరాలను సేకరించేందుకు ఆసిఫ్ నగర్ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎమ్మెల్యే భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు