MLA KTR: కాంగ్రెస్ కరకుగుండెలు... కేటీఆర్ ఫైర్!

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేసిందన్నారు కేటీఆర్. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు.. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.

New Update
ktrrr

MLA KTR Slams Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల సమయంలో రైతులకు ఆశలు పెట్టి.. ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దూరం పెట్టిందని ఫైరయ్యారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి .. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారు అని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిందని చురకలు అంటించారు.

Also Read : 'అఘోరిని తన్ని తరిమి కొట్టండి'

రైతుభరోసా కోసం ఎదురుచూపులు...

ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ లో.." యాసంగి పోయి -వానాకాలం వచ్చింది. వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది. నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడు. నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడు. రుణం తీరక, కొత్త రుణం లేక,  అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండు. రైతుభరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదు. రెండు విడతలుగా  రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి... రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి .. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారు.

Also Read :  అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా భారతీయుడు..అసలేవరి భట్టాచార్య!

రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారు. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారు. రెండు పంటలకేనా రైతుబంధు?, మూడో పంటకు ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు. మొదటిపంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఎప్పటినుండి ఇస్తారో.. అసలు ఇస్తారో, ఇవ్వరో ఇప్పటివరకూ స్పష్టత లేదు. రైతుభరోసా సాయం సున్నా, రుణమాఫీ అరసున్నా, రైతుబీమా గుండుసున్నా. కాంగ్రెస్ కరకుగుండెలు కరిగేది ఎన్నడు?,..  రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడు?" అని ఫైర్ అయ్యారు.

Also Read :  కాంగ్రెస్ నేత హనుమంతరావు కారుపై రాళ్ల దాడి!

Also Read :  ఒక్క ఆకుతో ఎంతో రోగనిరోధకశక్తి మీ సొంతం

Advertisment
తాజా కథనాలు