Health Tips: ఒక్క ఆకుతో ఎంతో రోగనిరోధకశక్తి మీ సొంతం చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. మునగాకు తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. బలహీనత, అలసట జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. By Vijaya Nimma 27 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 చలికాలంలో జలుబు, దగ్గుతో పాటు కొన్ని వ్యాధులు ప్రబలుతాయి. మునగాకు తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. 2/6 మునగ ఆకుల్లో విటమిన్ సి, ప్రొటీన్, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. బలహీనత, అలసట లేకుండా చేస్తుంది. 3/6 మునగాకు రసం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. 4/6 మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి మునగాకు ఉపశమనం కల్పిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో వాపు, మంటను తగ్గిస్తాయి. 5/6 మునగాకులో తగినంత కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. కీళ్లనొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 6/6 మునగ ఆకులు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంలో మంట, ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. #health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి