BREAKING: 'అఘోరిని తన్ని తరిమి కొట్టండి'

ఆంధ్రకు నాలుగు సంవత్సరాల తర్వాత గోవింద నంద సరస్వతి స్వామీజీ వచ్చారు. నకిలీ అఘోరీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్న నకిలీ అఘోరీలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కోరారు.

New Update

AP News: గోవింద నంద సరస్వతి స్వామీజీ కృష్ణా జిల్లా గన్నవరంకు విజయ యాత్ర చేసేందుకు వచ్చారు. కర్ణాటక పంపా క్షేత్ర సాధకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ  ఏపీలో ఐదు రోజులు పాటు విజయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా  విమానాశ్రయం దగ్గర  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4  ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు చెప్పారు. అఘోరీ, నకిలీ స్వామీజీలు, నకిలీ పీఠాధిపతులని చెప్పుకుంటూ  కొందరు తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇంలాంటి స్వాములు మాయమాటలు చెప్పి ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

అఘోరీలను కఠినంగా శిక్షించారు:

నకిలీ అఘోరీపై  ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అంతేకాకుండా  420 సెక్షన్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ద్వారక, బద్రి, జ్యోతిష్ పీఠం శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. ఇలాంటి నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగేటప్పుడు ఎదిరించాలని ప్రజలను ఆయన సూచించారు. ప్రభుత్వాలు ఇలాంటి అఘోరీలను కఠిన నిర్ణయం తీసుకుని శిక్షిస్తే వీళ్ళ భూతం వదులుతుందన్నారు. భారతదేశంలో అఘోరీలు, నాగ సన్యాసులు, ఎక్కడ ఉంటారో మాకు  తెలుసని పేర్కొన్నారు. 2025లో మహాకుంభం రానుందని.. జగద్గురువు శంకరాచార్యుల నిజమైన సైన్యం అఘోరీలు, అఖడాలు అక్కడికి వస్తారని ఆయన తెలిపారు.

Also Read: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు