TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో
ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు.
Breaking :
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని హాట్… pic.twitter.com/jGt25gT935
ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన - మంత్రి పొంగులేటి
ప్రభుత్వాన్ని కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన
ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు
అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..
ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పొంగులేటి కౌంటర్..