Delimitation: ప్రత్యేక దేశంగా సౌత్ ఇండియా.. MLA సంచలన కామెంట్స్
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఆదివారం కరీనంగర్‌లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందలో భాగంగా ఏర్పాట్లు చూస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో పలు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయని తెలిపారు. వాటిని సమర్థవంతంగా అమలు చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు చూస్తే ప్రత్యేక సౌత్ ఇండియా తిరుగుబాటు తప్పదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలోనే ఆ డిమాండ్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా డీలిమిటేషన్‌కు సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఐక్య కార్యచరణ సమితి (JAC) సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్‌కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. మీ సమావేశంలో లోక్‌సభ పునర్విభజన ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఖరారు చేసిన లోక్‌సభ సీట్లను అప్పటిదాకా కొనసాగించాలన్నారు. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తెలిపారు.

Delimitation Issue

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయని తెలిపారు. వాటిని సమర్థవంతంగా అమలు చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు చూస్తే ప్రత్యేక సౌత్ ఇండియా తిరుగుబాటు తప్పదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలోనే ఆ డిమాండ్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
Also Read: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు
ఇదిలాఉండగా డీలిమిటేషన్‌కు సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఐక్య కార్యచరణ సమితి (JAC) సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్‌కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. మీ సమావేశంలో లోక్‌సభ పునర్విభజన ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఖరారు చేసిన లోక్‌సభ సీట్లను అప్పటిదాకా కొనసాగించాలన్నారు. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తెలిపారు.
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్
Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
delimitation | telugu-news | rtv-news | gangula-kamalakar | national-news