ఏం పీ*క్కుంటావో పీ**క్కో | Gangula Kamalakar Strong Warning To Karimnagar Mayor Sunil Rao | RTV
TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరుతున్నట్లు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. కాగా నిన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. ప్రచారంలో డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేస్తావా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తాను భారీ మెజారిటీతో గెలబోతున్నానంటూ గంగుల ధీమా వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బిజేపీ నాయకుడు బండి సంజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు. సంజయ్ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, ఐటీ తమ చేతిలో ఉందనే అహంకారంతో తనపై దాడులు చేయించారని మండిపడ్డారు.
మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్ అవినీతిలో టాప్ ప్లేసులో నిలిచిందని అన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి గంగుల అంటూ ఫైర్ అయ్యారు.
2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు.