Miss World 2025: మిస్‌ వరల్డ్‌కు దక్కే ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మిస్ థాయ్‌లాండ్ ఓపల్‌ సుచాత జీవితం పూర్తిగా మారిపోనుంది. తక్షణమే రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమయ్యాయి. పలు అగ్ర బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా, మోడల్‌గా, నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టనున్నాయి.

New Update

మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ నిలిచారు. ఫైనల్‌ రౌండ్‌లో టాప్‌ 4లో నలుగురు.. మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీళ్ల నలుగురిలో థాయ్‌లాండ్‌ బ్యూటీ మిస్ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. దీంతో 2024 మిస్‌ వరల్డ్‌ విజేత క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ఓపల్ సుచాతకు ధరించారు. 

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

అయితే ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన మిస్ థాయ్‌లాండ్ ఓపల్ సుచాత జీవితం మారిపోనుంది. ఆమెకు రానున్న ఏడాది కాలంపాటు రాజయోగమే అని చెప్పాలి. ఈ మిస్ వరల్డ్‌కు దక్కే బహుళ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

Miss World 2025 విజేతకు దక్కే ప్రయోజనాలు

మిస్ థాయ్‌లాండ్ ఓపల్ సుచాత రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నారు. 

అలాగే వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమయ్యాయి. 

రానున్న సంవత్సరకాలం పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరినోట ఆమె పేరే వినిపిస్తుంది. 

మిస్‌ వరల్డ్‌ సంస్థ తరఫున ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరల్డ్ మొత్తం తిరిగిరావచ్చు. 

Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

పలు అగ్ర బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా, నటిగా, మోడల్‌గా, సామాజిక సేవా కార్యకర్తగా.. ఇలా చాలా అవకాశాలు ఆమెకు దక్కే అవకాశం ఉంది. 

వీటితో పాటు మరీ ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతి, గుర్తింపు మిస్ థాయ్‌లాండ్ ఓపల్ సుచాతకు లభించనున్నాయి.

సంవత్సరకాలం పాటు ఆమెకు లగ్జరీ లైఫ్‌,  స్టైలిస్టులు, ప్రొఫెషనల్‌ డిజైనర్లు, న్యూట్రిషనిస్టులు అందుబాటులో ఉంటారు. 

Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

అలాగే ఖరీదైన మేకప్‌ కిట్లు, ఖరీదైన డ్రెస్‌లు, నగలు వంటివి ఉచితంగా లభిస్తాయి. 

ఇక ఎంతో విలువైన వజ్రాలతో పాటు మరెన్నో ప్రత్యేకతలు పొదిగిన కిరీటాన్ని ఆమె అందుకున్నారు. 

ఆ కిరీటం విలువ సుమారు లక్ష అమెరికన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.85.56 లక్షలు. 

 

Miss World 2025 hyderabad | Miss World 2025 Contest | Thailand beauty Opal Suchata

Advertisment
Advertisment
తాజా కథనాలు