/rtv/media/media_files/2025/04/11/WUAC2oBYEiGkcNpprX3E.jpg)
Nampally POCSO court
Nampally POCSO court : ఆడపిల్లలను వేధించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి సర్వ సాధారణమై పోయాయి. ఎన్ని రకాల చట్టాలు చేసినా జనల్లో మార్పు రావడం లేదు. కొన్ని సార్లు న్యాయస్థానాల్లోనూ న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతుంటారు. అయితే 2023లో మైనర్ బాలికకు వేధింపుల విషయంలో నాంపల్లిలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?
మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు గుట్ల శ్రీనివాస్‌కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2023లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్ల శ్రీనివాస్ ఓ మైనర్ బాలికకు సెల్‌ఫోన్ ఇస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు జరిగిన సంఘటనను తల్లికి చెప్పుకుంది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!
Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం గుట్ల శ్రీనివాస్‌ను దోషిగా తేల్చింది. తాజాగా 25 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. కోర్టు తీర్పుపట్ల బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!
Also Read : వివాహితకు జైలర్ లైంగిక వేధింపులు.. న్యూడ్ కాల్స్ చేసి అది కావాలంటూ!