Vivek Venkataswamy : నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ సంచలన కామెంట్స్

నిజామాబాద్ పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా తనపై కుట్రల చేస్తున్నారని మండిపడ్దారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
vivek

నిజామాబాద్(nizamabad) పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి(vivek-venkataswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా తనపై కుట్రల చేస్తున్నారని మండిపడ్దారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌(adluri laxman) ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లక్ష్మణ్‌ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. మంత్రి లక్ష్మణ్‌ వస్తే తాను వెళ్లిపోతున్నాననడం పచ్చి అబద్దమని చెప్పారు. 

Also Read :  ఖమ్మం 54వ డివిజన్ లో హైటెన్షన్.. కార్పొరేటర్ భర్త హత్యకు కుట్ర

లక్ష్మణ్‌ను ప్రోత్సహించింది కాకానే

తనది మాల జాతి అని మంత్రి లక్ష్మణ్‌ విమర్శిస్తున్నారని,  రాజకీయాల్లో లక్ష్మణ్‌ను ప్రోత్సహించింది కాకానే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు  మంత్రి వివేక్ . జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారా అని వివేక్ ప్రశ్నించారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని,  తన మీద ఎందుకు ఇంత ఈర్ష్య.. తాను అందరితో కలిసి కట్టుగా ఉంటానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం.. విమర్శలను పట్టించుకోను.. అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు మంత్రి వివేక్.  మాలల ఐక్య సదస్సలో మంత్రి వివేక్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 

Also Read :  తల్లిదండ్రులను వదిలి ఉండలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు