కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి తుమ్మల.. రేవంత్ బిగ్ స్కెచ్ ఇదేనా?

కాళేశ్వరం కమిషన్ విచారణకు త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరు కానున్నారు. BRS హయాంలో కేబినేట్ సభ్యుడిగా పలు సబ్ కమిటీల్లో తుమ్మల సభ్యుడిగా పనిచేశారు. దీంతో ఆయన వాగ్మూలం కీలకంగా మారునుంది. మొదటి నుంచి ఆయన హరీశ్, ఈటల, KCR సమాధానాలను తప్పుబడుతున్నారు.

New Update
Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు

కాళేశ్వరం కమిషన్ విచారణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, వైఫల్యాలపై సీఎం రేవంత్ దృష్టి పెట్టింది. మరికొన్ని రోజుల్లో అన్ని ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు రానున్నట్లు సమాచారం. కమిషన్ ఎదుట సాక్షులు సమర్పించిన వాంగ్మూలాలను సీఎంవో నిశితంగా పరిశీలిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో మంత్రి తుమ్మల వాంగ్మూలం కీలకంగా మారనుంది. బీఆర్ఎస్ హయాంలో కేబినేట్ సభ్యుడిగా పలు సబ్ కమిటీల్లో తుమ్మల సభ్యుడిగా పనిచేశారు. త్వరలోనే కమిషన్ ఎదుటకు ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఆయన వ్యాఖ్యలు మొదటి నుంచి హరీశ్ రావు, ఈటెల రాజెందర్ చెప్పి అంశాలకు భిన్నంగా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టుకు కార్యనిర్వాహక అనుమతులు తప్ప మంత్రివర్గ ఆమోదం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరావు చెబుతున్నారు. 

కేబినేట్, సబ్ కమిటీ ఎదుటకు రాకుండానే నిర్మాణ పనులు మొదలయ్యాయని ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆరోపిస్తున్నారు. 2016 ఫిబ్రవరి 18న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి రూ.2,591 కోట్లతో పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయాలని ఈఎన్సీ మరళీధర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట. 2016 మార్చి1న జీవో నెం. 231 ద్వారా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందని తుమ్మల అన్నారు.14 రోజుల తదనంతరం అప్పటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందంటున్న ఆయన చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణాన్ని క్యాబినెట్‌ ఆమోదించిందని జస్టిష్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వారి వాంగ్మూలాలను మంత్రి తుమ్మల ఖండించారు. ఆయన అన్ని ఆధారాలతో కూడిన లేఖను పీసీ ఘోష్ కమిషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రి తుమ్మల కమిషన్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో  ఆయన వాంగ్మూలం కీలకంగా మారనుంది. 

Advertisment
తాజా కథనాలు