Minister Seethakka : పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీకి వివరించారు. వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..! Also Read: ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు! ఫుడ్ పాయిజన్ ఘటనలపై.. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. వీటి వెనుక ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కుట్ర ఎవరు చేశారనేది బయటపెడతామన్నారు. కుట్రల్లో భాగమైన అధికారుల ఉద్యోగాలు తీసేస్తామన్నారు. నిర్మల్ లో ఇథనాల్ కంపెనీకి అనుమతిచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్‌కు రావాలని సవాల్ విసిరారు. Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్! సీఎం రేవంత్ సీరియస్.. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. వసతిగృహాల్లో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆరా తీశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని సూచించారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు. Also Read: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత సంతతికి చోటు