46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

నటుడు సాయి కిరణ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం తన కోయాక్టర్ స్రవంతిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. సాయి కిరణ్ 'కోయిలమ్మ' సీరియల్లో కలిసి నటించారు. వీరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
sai kiran (1)

sai kiran

sai kiran Marriage: నటుడు సాయి కిరణ్, నటి స్రవంతి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.  గత నెల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. డిసెంబర్ 8 ఆదివారం మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. నటి స్రవంతి, సాయి కిరణ్ 'కోయిలమ్మ' సీరియల్లో కలిసి నటించారు. ఇందులో స్రవంతి సాయి కిరణ్ మేనకోడలి పాత్రలో నటించింది. కోయిలమ్మ సీరియల్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.  అయితే సాయి కిరణ్ కి ఇది రెండో అన్నట్లుగా తెలుస్తోంది. సాయి కిరణ్, స్రవంతి పెళ్లి వేడుకకు పలువురు బుల్లితెర సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కాగా.. ఈ కొత్త జంటకు  సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. 


Also Read: 'గర్ల్‌ఫ్రెండ్' ని పరిచయం చేయబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్టర్ వైరల్!

సీరియల్స్ లో 

హీరోగా కెరీర్ ప్రారంభించిన సాయి కిరణ్  'ప్రేమించు'  సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత  'మనసుంటే చాలు' 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'ఎంత బావుందో', 'జగపతి', తదితర చిత్రాల్లో నటించాడు. కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన  సాయి కిరణ్ .. సీరియల్స్ లో అవకాశాలు రావడంతో ఆ దిశగా అడుగులు వేశారు.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ సీరియల్స్‌లో పనిచేశారు. తెలుగులో 'గుప్పెడంత మనసు', 'కోయిలమ్మ', 'పడమటి సంధ్యరాగం' సీరియల్స్ తో  బుల్లితెర పై  సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. 

Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు