TG News : తెలంగాణలో సంచలనం రేపిన లగచర్ల ఘటనలో మరిన్ని దారుణాలు బయటపడ్డాయి. ఫార్మా సిటీ నిర్మాణంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అనుచరుడు భోగమోని సురేష్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా దాడికి సంబంధించిన విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే దాడి చేసేందుకు టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారని, వారందరికీ మద్యం తాగించి మత్తలో అటాక్ చేయించినట్లు నిందుతులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. Also Read : Delhi: వైరల్ అయిన కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో.. బీజేపీపై ఆప్ మండిపాటు Also Read : AUS vs IND: మూడో టెస్టు.. భారత్ తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్! కోస్గీ నుంచి లిక్కర్ బాటిళ్ల తరలింపు.. ఈ మేరకు ప్రభుత్వ అధికారులపై దాడికి మూడు రోజుల ముందే నుంచే లగచర్లలో మద్యం పార్టీ జరిగినట్లు బయటపెట్టారు. నరేందర్ రెడ్డి అనుచరుడు సరేష్ కోస్గీలో లిక్కర్ బాటిళ్లను కొనుగోలు చేసి లగచర్ల తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కోస్గీ ఎక్సైజ్ పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరించగా.. నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్యంగా సమావేశాలు నిర్వహించి దాడులు చేసినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఆ 9 మందికి రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం! భోగమోని సురేష్ కుట్రలో కీలకంగా వ్యవహరించిన పట్నం నరేందర్ రెడ్డితో సహా మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. సురేష్‌ను అరెస్ట్ తరువాత అతడితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. వారందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాడికి పాల్పడిన 16 మందికిపైగా పోలీసులు కేసులు నమోదు చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. Also Read : దోమలు ఆ వ్యక్తుల బ్లడ్ మాత్రమే తాగుతాయట.! అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు