జిల్లాల రద్దుపై పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన

తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ జిల్లాను కూడా రద్దు చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Ponguleti2

తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ జిల్లాను కూడా రద్దు చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు. సోమవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు.  కేంద్రం వద్దకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా వెళ్తుంటాయని.. కానీ వెళ్లిన ప్రతీసారీ నిధులు రావని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో తెలుసంటూ సెటైర్లు వేశారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదల కోసమే పనిచేస్తుందని చెప్పారు. 

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి

ఇదిలాఉండగా.. సోమవారం శాసన మండలిలో పర్యాటక విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చ ప్రారంభించారు. దీంతో కాసేపటికే బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో రైతులకు పోలీసులు బేడిన అంశంపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. రైతులకు బేడీన విషయాన్ని చర్చకు తీసుకురావాలని బీఏసీలో కూడా కోరామని.. విపక్ష సభ్యులు చేసిన అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని మండలి ఛైర్మన్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

Also Read: Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం

విపక్ష సభ్యులు వారి స్థానాల్లో కూర్చోవాలని చెప్పినప్పటికీ కూడా బీఆర్‌ఎస్‌ నేతలు సభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు. 

Also Read: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం

Advertisment
తాజా కథనాలు