/rtv/media/media_files/2026/01/15/fotojet-2026-01-15t070453-2026-01-15-07-06-12.jpg)
Medarama Jatara
Medarama Jatara : మేడారానికి భక్తులు పోటెతతుతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క-సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తుల బారులు తీరారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. అయితే ముందుగానే భక్తులు దర్శించుకుంటు న్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.భక్తులు అత్యధికంగా సొంత వాహనాలతో తరలి రావడంతో పస్రా-మేడారం మధ్య వాహనాల రద్దీ పెరిగింది. దర్శనానికి లక్షల మంది భక్తుల వస్తారని అంచనా వేసిన అధికారుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసుల ఎక్కడికక్కడ జాగ్రత్తలు చెబుతున్నారు. వరస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/15/fotojet-2026-01-15t070513-2026-01-15-07-07-00.jpg)
ఘనంగా గుడిమెలిగే పండుగ
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో తొలి పూజలైన గుడిమెలిగే పండుగ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజారులు కుటుంబ సమేతంగా అమ్మవార్ల పూజా మందిరాలకు డోలు వాయిద్యాలతో తరలివచ్చారు. ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్దబోయిన మునీందర్ నివాసంలో సమావేశమై, అక్కడ నుంచి మేడారం గ్రామంలోని సమ్మక్క దేవత పూజా మందిరానికి వచ్చి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆడపడుచులు అమ్మవారి శక్తిపీఠం ప్రదేశంలో, గుడి ప్రాంగణంలోని ప్రకృతి దేవతల ప్రదేశాలను ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేశారు. వడ్డెలు అడవికి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చి పూజా మందిరంపై పరిచారు. తర్వాత పూజారులు సిద్దబోయిన జగ్గారావు, మునీందర్, మహేశ్, నితిన్, చందా గోపాల్‌రావు, కొక్కెర కృష్ణయ్య తదితరులు పూజా మందిరంలోకి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్దకు వెళ్లి సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకొన్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/15/fotojet-2026-01-15t070527-2026-01-15-07-07-20.jpg)
కన్నెపల్లిలో సారక్క పూజారులు కాక సారయ్య, కాక కిరణ్ పూజా మందిరాలకు చేరుకుని శుద్ధి చేశారు. ఆడపడుచులు పూజా మందిరాల్లోని గద్దెలను మట్టితో అలుకుపూతలు నిర్వహించి ముగ్గులు వేశారు. అమ్మవారి పూజా సామగ్రిని సమ్మక్క దేవత పూజారి కొక్కెర కృష్ణయ్య భద్రపరిచిన స్థలం నుంచి తీసుకువచ్చి శుద్ధిచేశారు.
జాతరకు రూ.260 కోట్ల కేటాయింపు
ఈసారి జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.150 కోట్లు ఏర్పాట్ల కోసం, రూ.110 కోట్లు శాశ్వత నిర్మాణాల కోసం ఖర్చు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వం మేడారానికి భారీగా నిధులు కేటాయించి జాతర వైభవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటోందని మంత్రులు చెబుతున్నారు. జాతర ముగిసే వరకు వైద్య, విద్యుత్ శాఖల సిబ్బందితో పాటు ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, స్నానఘట్టాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరను విజయవంతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని, ఇందులో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
18న మేడారంలో కేబినేట్ భేటీ ?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజదాని వెలుపల కేబినేట్ భేటీ జరపాలని నిర్ణయించడం ఇటీవల ఇదే ప్రథమం. అయితే సీఎం షెడ్యూల్ కారణంగా అక్కడ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంది. ’సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర’ ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత క్యాబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్‌కు వెళ్తారు.
Follow Us