Minister Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి బీఆర్ఎస్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదని అన్నారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి రెండ్రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?
నెస్ట్ సీఎం అతనే...
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సీఎం మార్పు ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇంకో ఐదేళ్లు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉంటారని అన్నారు. అందులో అనుమానాలు అవసరం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మూసీ నది పక్కన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Also Read: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!
బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం సమయం నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నారని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో తనకు అగ్గిపెట్టె దొరకలేదని హరీష్ రావు అన్నారని... ఆ రోజు మనం నమ్మి ఉండవచ్చు... కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... అలా వస్తే వారి మీది నుంచి డోజర్లను పోనిస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయని బతుకు ఎందుకని ధ్వజమెత్తారు.
Also Read: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!
Also Read: మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్కచావు చస్తారు!