తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది.

New Update
Students

Students

TG New: తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 50 రూపాయల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అలాగే 200 రూపాయల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 12వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు.

డిసెంబర్ 21వ తేదీ వరకు..

అంతేకాకుండా 500 రూపాయల ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించారు. రెగ్యుల‌ర్ స్టూడెంట్స్‌ అన్ని పేప‌ర్లకు క‌లిపి 125 రూపాయలు, మూడు కంటే త‌క్కువ పేప‌ర్లు ఉంటే 110 రూపాయలు, మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు

ప్రతి సంవత్సరం మార్చిలో టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి. స్టూడెంట్స్‌కి నవంబర్‌ నుంచే  స్టడీ అవర్స్ ఉంటాయి. ఉదయం 2 గంటలు, సాయంత్రం మరో 2 గంటలు అదనంగా స్టడీ అవర్స్‌లో విద్యార్థులు వీక్‌గా ఉన్న సబ్జెక్జ్‌పై ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు.

ఇది కూడా చదవండి:హార్స్‌ పవర్‌ అంటే ఏంటి?..గుర్రాలకు ఎంత శక్తి ఉంటుంది?

Advertisment
తాజా కథనాలు