మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్కచావు చస్తారు!

మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.  

author-image
By srinivas
New Update
se

CM Revanth: మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.  సంగెంలోని మూసీనది ఒడ్డు మూసీ పునరుజ్జీవన పాదయాత్రను ప్రారంభించారు.  

శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి..

ఈ మేరకు శుక్రవారం సంగెంలోని మూసీనది ఒడ్డున శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసీ పునరుజ్జీవన పాదయాత్రను ప్రారంభించారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కి.మీ మేర పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోంది. ఈ మూసీని ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ. మూసీ నది విషంగా మారింది. ఇది మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర. మూసీ నల్గొండ ప్రాంతానికి ఒకనాడు వరం అని, ప్రస్తుతం నల్గొండను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ పీడిస్తోంది' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

Also Read: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?

గొర్రె మాంసం కొనే పరిస్థితి లేదు..

ఇక మూసీ ప్రాంతంలో గౌడన్నలు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. మూసీ నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి కూడా లేదని, ఇక్కడ గేదె, ఆవు పాలను కొనే పరిస్థితి కనిపించట్లేదన్నారు. బాధిత రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నా. మూసీ కింద కూరగాయ రైతులు వ్యవసాయం బంద్ చేసుకున్నారు.  ఇక్కడ నుంచి ప్రతి కులవృత్తి వలస వెళ్లింది. బీఆర్ఎస్ కు దోచుకోవడమే తప్ప మేలు చేయడం తెలియదు. మూసీ నది హైదరాబాద్ కు అణుబాంబు కంటే ప్రమాదం. మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏమిటి? మూసీ నది వరంగా మారాల్సింది శాపంగా మారితే బాగుచేయొద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన

నా జన్మదినం కాదు జన్మధన్యం..
ఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం. సంగెం ప్రాంతంలో కుల వృత్తులు చేసుకొనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు  ఒక పక్క ప్లోరైడ్, మరో పక్క మూసి నీళ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో హైదరాబాద్ ప్రజలకు జీవ నదికి మూసీ ఉండేది. నల్లగొండ ప్రాంత ప్రజలకు పాడి పంటలకు నెలువుగా గతంలో మూసీ ఉండేది. నా జన్మదినం రోజు నల్లగొండ ప్రజలు వేళ మంది నాకోసం వచ్చారు. పొద్దటి నుంచి అన్నం తినకుండా మూసీ పునరుజ్జీవం కావాలని ధృఢ సంకల్పంతో ఇంతసేపు ఉన్నారు. మూసీలో చేపలు బ్రతికే పరిస్థితి లేదు. మూసీ పక్కన పెంచే గొర్రెలను కొనే పరిస్థితి లేదు. నల్లగొండ , రంగారెడ్డి బిడ్డలను కాపాడుకునేందుకే మూసీ పునరుజ్జీవం చేస్తాను. దేవుడు నాకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశంతోనే నడుం బిగించి మూసి పునరుజ్జీవం చేసేందుకు అడుగు ముందుకు వేశాను. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. మూసి పునరుజ్జీవాన్ని స్వాగతించిన సీపీఐ, సీపీఎం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా?

బిల్లా, రంగడు దమ్ముంటే అడ్డుకోండి..
మూసీ పై లక్ష యాభై వేల కోట్లని...నేను దోచుకుంటున్న అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణిలో అభ్రక దబ్రక చేస్తే వేళ కోట్ల రూపాయలు వస్తాయి. బుల్ డోజర్లకు అడ్డంగా పడుకునే నాయకుల పేర్లు చెప్పండి. బిల్లా, రంగడు దమ్ముంటే బుల్ డోజర్లకు అడ్డంగా పడుకోవాలి. తేది, టైమ్ చెప్తే కోమటి రెడ్డి వెంకట రెడ్డీతోనే బుల్ డోజర్ నడిపిస్తా. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ జెండా ఊపుతాడు. ప్రజల అండతోనే మేము పదవిలో ఉన్నాము. నల్లగొండ జిల్లాలో మూడు అడుగులోడు ( జగదీష్ రెడ్డిని ఉద్దేశించి) జర్రలో గెలిచాడు. నల్లగొండ గడ్డ ఉద్యమాల గడ్డ.. వారి పౌరుషం ఏంటో మూసీని అడ్డుకుంటే చూపిస్తారు. మూసి పునరుజ్జీవం వద్దంటే నల్లగొండ బిఆర్ఎస్ , బిజెపి నాయకులు చరిత్ర వినులుగా మిగిలిపోతారు. బిల్లా , రంగడు , చార్లెస్ చాబేజ్ దమ్ముంటే మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకొండి చూద్దాం. హరీష్ రావు సవాల్ ను స్వీకరిస్తున్న దమ్ముంటే మూసి వెంట పాదయాత్ర చెయ్ అంటూ మండిపడ్డారు. 

Also Read: తెలంగాణలో ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్లకేనా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు