Balakrishna: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!

AP: హిందూపురంలో జగన్‌కు బాలకృష్ణ షాక్ ఇచ్చారు. చైర్ పర్సన్ ఇంద్రజతో సహా 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైసీపీ సంఖ్యాబలం తగ్గడంతో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఖాతాలో పడింది.

New Update
JAGAN BALAKRISHNA

MLA Balakrishna: మాజీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తన ఇలాఖా లో మరో అంకానికి తెర లేపారు. ప్రభుత్వం మారాక చైర్ పర్సన్ ఇంద్రజ తో సహా 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఉన్న టీడీపీ కౌన్సిలర్లతో సహా ప్రస్తుతం 22 మంది కౌన్సిలర్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. కోరం సరిపోడంతో మున్సిపల్ చైర్ పర్సన్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. 

Also Read: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్!

హైదరాబాద్ కు కౌన్సిలర్లు...

 22 మంది కౌన్సిలర్లను ప్రత్యేక బస్ లో హైదరాబాద్ కు నందమూరి బాలకృష్ణ తరలించారు. ప్రైవేట్ రిసార్ట్ లో కౌన్సిలర్లు మకాం వేశారు. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులకు 30 కౌన్సిలర్లను వైసీపీ గెలవగా.. టీడీపీ - 6, ఇతరులు ఇద్దరు గెలిచారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు జారిపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. తెలుగుదేశం తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఆరవ వార్డ్ కౌన్సిలర్ డీఈ.రమేష్ కుమార్ ఎంపిక చేసినట్లు సమాచారం.

Also Read: వైఎస్ భారతి పీఏ అరెస్ట్!

ఇటీవల 8 మంది...

హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ-30, టీడీపీ-6, బీజేపీ-1, ఎంఐఎం-1 చొప్పున విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు.

Also Read: రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు

Also Read: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు