/rtv/media/media_files/2025/07/12/occultism-medak-2025-07-12-12-09-02.jpg)
Occultism medak
TG Crime: మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. పసురం తండాకు చెందిన రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని అతని సొంత తమ్ముడు మోహన్ తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. కుటుంబానికి చెందిన ట్రాక్టర్ కిరాయి డబ్బులు, మంత్రాల అనుమానంతో మోహన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలో మంత్యా, మోహన్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇంకా బాకీ ఉండిపోయాయి. అయితే ఇటీవల మంత్యా అదే తండాలోని మరొకరి ట్రాక్టర్‌ను పొలం దున్నేందుకు ఒప్పందం చేసుకోవడంతో మోహన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
మంత్రాల నెపంతో అన్నను దారుణంగా..
ఈ విషయం తెలుసుకున్న మోహన్ మంత్యాను నిలదీశాడు. నన్ను కట్టిపడేస్తూ ఇంకొకరితో ఒప్పందం చేస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహంతో స్పందించాడు. నీ పొలం దున్నితే ట్రాక్టర్ తగులబెడతా అని బెదిరింపులకు దిగాడు. ఈ సమాచారాన్ని ట్రాక్టర్ యజమాని బిక్షపతి ఫోన్‌లో మంత్యాకు తెలిపాడు. ఆ సమయంలో మోహన్ తన కల్లు దుకాణంలో ఉండగా మంత్యా అక్కడికి వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్తా మోహన్ చేతిలో ఉన్న కల్లు సీసాతో మంత్యాను తీవ్రంగా గాయపరిచిన మోహన్.. అనంతరం టవల్‌తో అతనికి ఉరివేసి హత్య చేశాడు. చనిపోయాడో లేదో అనే అనుమానంతో మస్తకంపై బండరాయి వేశాడు.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది
తీవ్ర గాయాలపాలైన మంత్యాను కుటుంబ సభ్యులు చికిత్స కోసం కొల్చారం ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. గత నెలలో మోహన్ మనుమరాలు మరణించగా ఆ విషయం గురించి కూడా మంత్యా మంత్రాలు చేశాడన్న అనుమానం మోహన్‌కు ఉంది. అప్పటి నుంచే అతడిలో అన్నపై ఆగ్రహం పెరిగిపోయిందని తెలుస్తోంది. ఈ విషాదకర ఘటన ప్రస్తుతం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
( TG Crime | crime | telugu-news | Latest News)