Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

అక్కినేని ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలైంది. నాగ చైత్యన్య–శోభితల పెళ్ళి కార్డు ప్రింట్ అయింది. దాన్ని బంధువులు, స్నేహితులకు పంచడం కూడా మొదలెట్టేశారు. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.13 గంటలకు చై–శోభితల ఫెళ్లి జరగనుంది. 

New Update
wedding

Naga Chaitnya- Sobhitha Wedding Card: 

అన్నపూర్ణ స్టూడియోలో మరి కొన్ని రోజుల్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌ మెంట్ చేసుకున్న నాగ చైతన్య–శోభితల పెళ్ళి త్వరలో జరగనుంది. దీనికి ముహూర్తం కూడా పెట్టేశారు. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.13 గంటలకు చై–శోభితల ఫెళ్లి జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖలను పంచడం మొదలుపెట్టింది అక్కినేని కుటుంబం. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకుల ప్రముఖులను అలాగే బంధుమిత్రులను వివాహానికి తప్పకుండా రావాలని అక్కినేని కుటుంబం ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

1

చై–శోభితల పెళ్ళి కార్డు సింపుల్‌గా చూడముచ్చటగా ఉంది. ఇందులో ఇద్దరి తల్లిదండ్రుల పేర్లతో పాటూ నాగచైతన్య నానమ్మ అన్నపూర్ణ, తాతయ్య నాగేశ్వరరావు అలాగే.. అమ్మమ్మ రాజేశ్వరి, తాతయ్య రామానాయుడుల ఆశీస్సులతో ఈ వివాహం జరుపుతున్నట్లుగా రాశారు. ఇక పెళ్ళికి బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శోభిత బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసిన కారణంగా అక్కడి వారిని ఆహ్వానించారని తెలుస్తోంది. 

Also Read: గ్రూప్-3లో కులంపై వివాదాస్పద ప్రశ్న.. RS ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు