/rtv/media/media_files/2025/08/21/marwari-go-back-2025-08-21-16-48-45.jpg)
Marwari Go Back campaign
MARVAADI : తెలంగాణలో ఊపందుకున్న గో బ్యాక్ మార్వాడీ ఉద్యమంపై మార్వాడీలు అందోళన వ్యక్తం చేశారు. మార్వాడీలు టార్గెట్‌గా విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆమన్‌గల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మార్వాడీ సమాజంపై విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలకు వ్యతిరేకంగా తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డీజీపీ కి తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అగర్వాల్, మార్వాడీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన అగర్వాల్ సమాజ్ తెలంగాణ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రశాంత రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని, శాంతిభద్రతలను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఒక తీవ్రమైన ఆందోళనకరమైన విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల తమ సమాజంలోని సభ్యులను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత నినాదాలు, బెదిరింపులకు పాల్పడిన కొన్ని తీవ్రమైన సంఘటనలు జరిగాయన్నారు.
Also Read: Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!
సికింద్రాబాద్ మొండా మార్కెట్ కొంతమంది వ్యక్తులు బహిరంగంగా "మార్వాడీ కల్చర్ గో బ్యాక్" అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. మోండా మార్కెట్‌లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా...మార్వాడీ గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ బహిరంగ శత్రుత్వ ప్రదర్శన ఆ ప్రాంతంలోని వ్యాపార వర్గాలు నివాసితులలో భయం, అభద్రతా భావాన్ని సృష్టించిందన్నారు.ఇక అమన్‌గల్ ఘటనను రికార్డ్ చేసి, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. మార్వాడీ, అగర్వాల్ సమాజం ఒక శతాబ్దానికి పైగా తెలంగాణ సమాజంలో అంతర్భాగంగా ఉంది. మేము బయటి వ్యక్తులం కాదు, రాష్ట్ర పురోగతిలో గర్వించదగిన భాగస్వాములం అని వారు పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధిలో మా వాటా కూడా ఉందని,వేలాది మంది తెలంగాణ వాళ్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని అగర్వాల్ సమాజ్ లేఖలో వివరించింది.
ఇది కూడా చదవండి:High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇక మర్వాడీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే వైరల్ కంటెంట్‌ను పర్యవేక్షించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తక్షణమే తొలగించడానికి సైబర్ క్రైమ్ విభాగాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, ముఖ్యమైన వ్యాపార మార్వాడీ జనాభా ఉన్న ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను పెంచి, భద్రతా భావాన్ని కల్పించాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: నకిలీ సర్టిఫికేట్లలో 59 మందికి జాబ్స్.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం!