BIG BREAKING: నకిలీ సర్టిఫికేట్లతో 59 మందికి జాబ్స్.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం!

తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్లతో పోలీస్ ఉద్యోగం పొందిన వారి బాగోతం బయటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 59 మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది.

New Update
Telangana Police Jobs

తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్లతో పోలీస్ ఉద్యోగం పొందిన వారి బాగోతం బయటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 59 మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది. వీరిపై చర్యలు తసుకోవాలని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు అధికారులు. దీంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఇప్పటికే వివిధ పోలీస్ ప్రాంతాల్లో సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా చేస్తున్నారు. దీంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై తెలంగాణ పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామకాలు జోనల్, జిల్లా కేటగిరీలుగా ఉంటాయి.
ఇది కూడా చదవండి:High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్‌ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

అందుకు అనుగుణంగా లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులను గుర్తిస్తారు. లోకల్ గా గుర్తించడంలో బోనఫైడ్ సర్టిఫికేట్ కీలకంగా ఉంటుంది. ఇది ఆసరాగా చేసుకొని కొందరు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్లను సృష్టించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం గుర్తింపు లేని స్కూళ్లలో చదవడం, అవి మూతపడడంతో తప్పని పరిస్థితుల్లో ఇలా చేశారన్న చర్చ కూడా ఉంది. అయితే.. కేవలం ఈ 59 మంది మాత్రమే ఇలా తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందారా? లేక ఇలా ఇంకా చాలా మంది ఉన్నారా? అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది.

అయితే.. ఇది ఒక్క పోలీస్ శాఖలో మాత్రమే కాదు, ఇతర విభాగాల్లో కూడా ఇలాంటి అభ్యర్థులు ఉన్నారన్న అభిప్రాయం కూడా నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారి కారణంగా తాము ఉద్యోగాలకు అర్హత పొందలేకపోతున్నామని అంటున్నారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తోంది?

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ బోర్డు ద్వారా పోలీస్ శాఖలో దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసే ఈ బోర్డు నియామకాల సందర్భంగా జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సర్టిఫికేట్లను వెరిఫికేషన్ ను సరిగా చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభ్యర్థులు బోర్డును బురిడీ కొట్టించారా? లేక బోర్డులో కొందరు అభ్యర్థులతో చేతులు కలిపి ఇలా చేస్తున్నారా? అన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరిగితేనే ఈ అంశంపై పూర్తి విషయాలు వెలుగులోకి రానున్నాయి. 

Advertisment
తాజా కథనాలు