PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు

రెండు స్టార్ ఒలింపిక్స్ విజేత, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈనెల 22న సింధు వివాహం జరగనుంది.

author-image
By Manogna alamuru
New Update
00

పీవీ సింధు...ఈ తెలుగు మ్మాయి సాధించని విజయాలు లేవు. స్టార్ షట్లర్ గా కొనసాగుతున్న సింధు రెండు సార్లు ఒలింపిక్స్ పతకాన్ని గెలుచుకుంది. దాంతో పాటూ బ్యాడ్మింటన్‌లో అన్ని పోటీల్లోనూ పతకాలను భారత్‌కు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ఇంకా కెరీర్‌‌లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యలో సింధు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయితో ఆమెకు పెళ్లి ఖాయమైంది. ఈనెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వీరి వివాహానికి వేదిక కానుంది. మరోవైపు సింధు హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఇది కూడా మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

Also Read :  నెట్ ఫ్లిక్స్ లో 'లక్కీ భాస్కర్' హవా.. ఏకంగా 'దేవర' ను వెనక్కి నెట్టి

PV Sindhu Marriage

పీవీ సింధు పెళ్​ళి చేసేకుంటున్న వెంకట దత్తసాయి...హైదరాబాద్‌ఓని పోసైడెక్స్ టెక్నాలజీస్‌కు ఎక్జిక్యూటివ్ డైరెక్ట్‌గా ఉన్నారు. ఇరు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలుస్తోంది. జవరి తర్వాత నుంచీ పీవీసింధుకు బ్యాడ్మింటన్ టోర్నీలు ఉండి, బిజీగా అయిపోతుందని... అందుకే డిసెంబర్‌‌లో పెళ్​ళి చేయాలని డిసైడ్ అయ్యామని ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లో పెళ్ళి అయిన తర్వాత డిసెబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుందని చెప్పారు.  

Also Read: AP:  వామ్మో అంత ధరలా..ఏపీలో పుష్ప–2 టికెట్ ధరలు భారీగా పెంపు

Also Read :  ఏపీలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు