హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌.. పదోతరగతి ఉంటే చాలు!

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది.

New Update
Agniveer recruitment

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రేడ్‌లలో నియామకాలు చేపట్టనన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం 

అర్హత:

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

అగ్నివీర్ జనరల్ డూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉతీర్ణత ఉండాలి. 

అర్హులు:

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల్, మెదక్, మంచిర్యాల, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కుమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల,  సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి,  వనపర్తి, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే రిక్రూట్‌మెంట్ కార్యాలయానికి సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఈ ఫోన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచారు. 040-27740059, 27740205 ద్వారా పరిష్కరించుకోవచ్చు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు