'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ 'పుష్ప2' ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' పుష్ప2 షూటింగ్ టైం లో నేను సెట్స్ కి వెళ్ళినప్పుడు సుకుమార్ సినిమాలోని ఓ సీన్ చూపించారు. అది పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఎపిసోడ్‌తోనే అర్థమైంది..'అని అన్నారు By Anil Kumar 03 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రూల్' ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ దేశ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రత్యేక ఈవెంట్స్ పెట్టి మరీ ప్రమోట్ చేశారు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ‘వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి.. 'పుష్ప2' గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు! 'పుష్ప 2' కి ప్రమోషనే అవసరం లేదు.. ‘పుష్ప 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీకి చెప్పా. ఉత్తరాదిలో నీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. తప్పకుండా అక్కడ సినిమాని ప్రమోట్ చేయ్ అని.. మళ్ళీ మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’కి ఎలాంటి ప్రచారం అవసరం లేదని చెబుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా టికెట్స్ ఇప్పటికే బుక్ చేసుకుని ఉంటారని అర్థమవుతోంది. హీరో, దర్శకుడు.. ఇలా ఈ చిత్రం గురించి ఏం మాట్లాడకపోయినా ఫర్వాలేదు. అందుకే ఓ సరదా సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నా. రెండుమూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో ‘పుష్ప 2’ చిత్రీకరణ జరిగింది. అదే సమయంలో నేనూ అక్కడికెళ్లా. ‘సర్.. సినిమాలోని ఓ సీన్ చూస్తారా?’ అని సుక్కూ అడిగారు. చూస్తానని నేను చెప్పగానే ఎడిటర్‌ని పిలిచి.. కొన్ని మార్పులు చెప్పారు. అది పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్. ‘దీనికి దేవిశ్రీ ప్రసాద్ ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత ఇచ్చేయొచ్చు’ అని చెప్పా. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఎపిసోడ్‌తోనే అర్థమైంది.." అని అన్నారు. దీంతో 'పుష్ప2' పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! #s-s-rajamouli #pushpa2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి