/rtv/media/media_files/2024/12/03/iGSf3XGWxb089w2qi10m.jpg)
ప్రశాంతంగా యోగా,ధ్యానం చేసేందుకు సముద్రం ఒడ్డుకు వెళ్లిన ఓ యంగ్ హీరోయిన్ ని ఓ రక్కసి అల లాక్కెళ్లి ప్రాణాలు తీసింది.ఈ విషాద ఘటన థాయిలాండ్ లో జరిగింది. రష్యాకు చెందిన 24 ఏళ్ల యువ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ.. ప్రస్తుతం థాయిలాండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ద్వీపంలో నీటి ఒడ్డున రాళ్లపై కూర్చొని ధ్యానం చేస్తుండగా ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది.
Also Read: Earth Orbit: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస
సముద్రంలో ఏర్పడిన ఓ భారీ కెరటం.. దూసుకొచ్చి ఆమెను లాక్కెళ్లిపోయింది. ఆ బీచ్‌లో అందరూ చూస్తుండగానే.. కొద్దిసేపటికి ఆమె శవం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఈ ఘోర విషాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: OTT: థియేటర్స్ లో 'పుష్ప2'..ఓటీటీ లో 23 సినిమాలు, మూవీ లవర్స్ కి పండగే
అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..24 ఏళ్ల రష్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ.. థాయిలాండ్‌లోని కోహ్ సుముయ్ ద్వీపంలో ఉన్న రాళ్లపై కూర్చుని ధ్యానం, యోగా చేసుకుంటుంది. ఆమె ధ్యానంలో మునిగిపోగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రంలో భారీ కెరటం ఏర్పడింది. దీంతో రాళ్లపై కెమిల్లా కూర్చున్న చోటుకే వచ్చిన రాకాసి అలలు.. ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లిపోయాయి. అక్కడే ఉన్న కొందరు.. ఆమెను పరిశీలిస్తూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారు.
Hình ảnh cuối của nữ du khách tập yoga trên mỏm đá trước khi bị sóng cuốn
— South of Vietnam (@vincent31473580) December 1, 2024
Một nữ du khách Nga 24 tuổi đã bị sóng cuốn xuống biển khi tập yoga trên mỏm đá tại điểm ngắm cảnh Lad Koh, đảo Koh Samui, Thái Lan vào ngày 29-11. pic.twitter.com/7VYbwevCzM
Russian Actress Kamilla Belyatskaya
అక్కడ ఉన్నవారిలో కొందరు ఆమెను రక్షించేందుకు కూడా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపటికి ఆమె శవం ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు ఆ వైరల్ వీడియోల్లో కనపడుతుంది.
ఈ నేపథ్యంలోనే తన థాయిలాండ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను.. ఆ ఘటనకు ముందు.. కెమిల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ధ్యానం కోసం ఆమె తీసుకెళ్లిన వస్తువులు ఆ సముద్రంలో తేలియాడుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆమె అలల్లో కొట్టుకుపోతుండగా ప్రాణాలను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించింది. కానీ చివరికి అందులోనే గల్లంతైంది.
Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు!
ధ్యానం చేస్తున్న రాయి నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో కెమిల్లా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిందని.. అంతకుముందు కూడా అదే ప్రాంతంలో ధ్యానం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: స్పృహ కోల్పోయిన తర్వాతే కాల్పులు.. ఎన్ కౌంటర్ పై డీజీపీ సంచలనం!
ఇక థాయ్‌లాండ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. ద్వీపం వద్దకు వెళ్లొద్దని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా.. పర్యాటకులు మాత్రం సముద్రంలోకి, ద్వీపం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఇక తనకు ఆ కోహ్ సుముయ్ ద్వీపం అంటే చాలా ఇష్టమని కెమిల్లా బెల్యాట్స్కాయ తన సోషల్ మీడియా పోస్టులో అంతకు ముందు చాలాసార్లు తెలిపింది.