/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
Maoists surrendered
Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్లతో భారీగా నష్టపోతుండగా తాజాగా మరికొంతమంది దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెనికి చెందిన 22 మంది కీలక కమాండర్లు సరెండర్ అయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.
పోరుకన్నా ఊరుమిన్న..
ఈ మేరకు ‘పోరుకన్నా ఊరుమిన్న.. మన ఊరికి తిరిగిరండి’ అనే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని శబరీష్ చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లొంగిపోయిన వారి వివరాలను వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ముచ్చకి జోగారామ్, ఏరియా కమిటీ మెంబర్ మడవి మాస, తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా, పార్టీ దళ సభ్యులు పూనెం సుక్కు, జనతన సర్కారు కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాస సోడి, మడకం దేవా, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న, కొత్తకొండ మజ్జి హైమవతి లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్‌పీఎఫ్ పీఎంజీ పంచమీలాల్, డీఎస్పీ ఎన్.రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
warangal | chattisgarh | telugu-news
Follow Us