/rtv/media/media_files/2025/10/28/screenshot-2025-10-28-160217-2025-10-28-16-03-24.png)
Maoist Chandranna Surrender: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ కీలక సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అలియాస్ ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ లు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు.
తెలంగాణ SIB కీలక ఆపరేషన్‌తో మావోయిస్టు లొంగుబాటు జరిగిందని డీపీపీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చంద్రన్న అజ్ఞాతం వీడారని ఆయన అన్నారు. చాలామంది నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుంటున్నారని డీజీపీ మీడియాతో అన్నారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బలోపేతానికి చంద్రన్న కృషి చేశాడు. చంద్రన్నపై రూ. 25 లక్షల రివార్డు ఉందని DGP తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. 64 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివథర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ
— Telugu Stride (@TeluguStride) October 28, 2025
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న
మరికాసేపట్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్న చంద్రన్న, బండి ప్రకాశ్..#Maoists… pic.twitter.com/J2HiepJjBJ
Also Read: తండ్రి వెధవ పనికి కూతురు సపోర్ట్.. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
లొంగిపోయిన అనంతరం చంద్రన్న మీడియా ముందు మాట్లాడారు. తెలంగాణ ప్రజల మధ్యనే ఉంటూ అంకిత భావంతో పనిచేస్తామని ఆయన అన్నారు. మావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరి తరం కాదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంగా బద్ధంగా పనిచేయాలని మావోయిస్టు పార్టీ ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు నిజమే ఈ సందర్భంగా చంద్రన్న చెప్పారు. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు విభేదాల గురించి మాట్లాడుతానన్నారు. పార్టీలో చీలక వచ్చింది కాబట్టి ఎవరి మార్గం వారిదే.. మా మార్గం మేం ఎంచుకున్నామని చంద్రన్న క్లారిటీ ఇచ్చారు.
Follow Us