/rtv/media/media_files/2025/01/29/BucVQzNBvPXQ86DgjrOP.jpg)
Chicken and mutton shops closed in Hyderabad tomorrow
చికెన్, మటన్ అంటే అందరికీ ఇష్టమే. ప్రతిరోజు మాంసం వండినా కాదనకుండా తినేందుకు ఇష్టపడతాం. అసలు ముక్క లేకుండా ముద్ద దిగనే దిగదు. ఎప్పుడు చూసినా.. చికెన్ షాపుల వద్ద జనాలు బారులు తీరుతూ కనిపిస్తారు. అలాంటి మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రేపు మాంసం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. దీంతో అందరూ ఏమైందంటూ గుసగుసలాడుకుంటున్నారు.
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా
రేపు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు మాంసం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోడి, మేక, గొర్రెల మండీల దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రేపు మాంసం దుకాణాలు బంద్
— Pulse News (@PulseNewsTelugu) January 29, 2025
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన అధికారులు
రేపు (గురువారం) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా..
మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు
ఈ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవంటూ వార్నింగ్
నిఘా ఉంచాలని పోలీసులకు అధికారుల సూచనలు
ఏపీ, తెలంగాణలోనూ… pic.twitter.com/y2LSAlceE1
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
ఇక ఈ ఆదేశాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. అయితే ఒక్క తెలంగాణాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ల కూడా ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
రిపబ్లిక్ డే నాడు ఆంక్షలు
ఇటీవల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ రోజు ఆదివారం కావడంతో పలు చోట్ల చికెన్ ధరలు భారీగా పెరిగినట్లు కూడా తెలిసింది. రేపు మరి ఏం జరుగుతుందో చూడాలి.