Odisha: స్కూల్‌ డ్రెస్‌లో చెట్టుకు వేలాడుతూ కనిపించిన బాలికల మృతదేహాలు

ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Bodies Of 2 Girls In School Uniforms Found Hanging From Tree In Odisha

Bodies Of 2 Girls In School Uniforms Found Hanging From Tree In Odisha

ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ల తల్లిదండ్రులు రెండురోజుల క్రితమే పోలీసులు ఫిర్యాదు చేశారు.     

Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

ఇక వివరాలల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 6న మల్కన్‌గరి జిల్లాలో స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యయ్యారు. స్కూల్‌ నుంచి వాళ్లు ఇంటికి రాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు వారికోసం అన్ని చోట్ల వెతికారు. ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికల కోసం గాలించారు. 

Also Read: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!

అయితే శనివారం స్కూల్ డ్రెస్‌లో ఆ బాలికల మృతదేహాలు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమాస్పద మృతి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.  

Also Read: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు