CM Revanth Reddy: రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.