/rtv/media/media_files/2025/10/27/lucky-draw-for-liquor-shops-today-2025-10-27-06-56-40.jpg)
Lucky draw for liquor shops today
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల(ts-liquor-shops) ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వచ్చిన దరఖాస్తులకు నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు. మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీడ్రా నిర్వహణకు ఆబ్కారీశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ లక్కీడ్రాలో మద్యం దుఖాణాలు ఎవరికీ దక్కుతాయో తేలనుంది.
Also Read : తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
Lucky Draw For Liquor Shops
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలు(Liquor Shops offer) ఉండగా వీటికి 95,137 దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి పలు మద్యం షాపులకు దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. అలా దరఖాస్తులు తక్కువగా దాఖలైన 19 దుకాణాల లక్కీ డ్రానుఎక్సైజ్ శాఖ వాయిదా వేసింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్స్‌లో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో మూడు ఉన్నాయి. వాటిలో ఖానాపూర్ వైన్స్‌షాపునకు గతంలో 63 దరఖాస్తులు రాగా ఈసారి 33.. నదర్‌గూడకు గతంలో 92 రాగా ఈసారి 31.. సర్దార్‌నగర్‌కు గతంలో 61 రాగా ఈసారి 35 మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌లో 6, ఆసిఫాబాద్‌లో 7, భూపాలపల్లిలో 2, సంగారెడ్డిలో ఒక దుకాణానికి కూడా తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఆయా వైన్స్‌కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మరోసారి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. దరఖాస్తులు పెరిగితే మరోసారి డ్రా తీస్తారు. క్రితంసారి కూడా ఇలాగే 22 షాపులకు తక్కువ దరఖాస్తులు రాగా డ్రాను వాయిదా వేసి ఆ తర్వాత నిర్వహించారు.
కాగా మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులకు పైగా రాజధానితోపాటు నగర పరిసరాల్లోనే నమోదయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోని 615 దుకాణాలకుగాను 33,835(35.56%) దరఖాస్తులు రావడం గమనార్హం. క్రితంసారి మొత్తం దరఖాస్తులు 1,31,490 రాగా.. ఇవే జిల్లాల్లో 42,596(32.39) వచ్చాయి. సరూర్‌నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని దుకాణాల్లో ఏటా రూ.40-50 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. విక్రయాల్లో 16-20% వరకు లాభాలొచ్చే అవకాశం ఉండటంతోనే వ్యాపారులు ఈ వైన్స్ షాపులకు పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
Follow Us