/rtv/media/media_files/2025/02/08/zW0u9uNnW4XABXbm7nYB.jpg)
max ott release
కన్నడ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kichcha) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మ్యాక్స్' (Max). గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు వచ్చాయి. రిలీజైన నెలరోజుల్లో ఈ చిత్రం రూ. 48.58 కలెక్షన్లు సాధించింది. అయితే థియేట్రికల్ రన్ తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు రాబోతుంది ఈమూవీ. తాజాగా మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
ఓటీటీలో మ్యాక్స్
సుదీప్ కిచ్చా 'మ్యాక్స్' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. థియేటర్ లో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : పుష్ప రాజ్ సక్సెస్ మీట్ .. మీడియా ముందుకు అల్లు అర్జున్!
🎬 Exciting news! 🎥 "Max" is set to release on 22nd February, 2025 exclusively on ZEE5! 📺 Mark your calendars and get ready for an unforgettable experience! 🍿
— ZEE5 (@ZEE5India) February 4, 2025
Also Read : క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చెర్రీ మూవీ..హింట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్!
డెబ్యూ డైరెక్టర్ విజయ్ కార్తికేయన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సునీల్, ఇళవరసు, ఉగ్రమ్ మంజు, సంయుక్త హోర్నాడ్, సుకృత వాగ్లే, సుధా బెలవాడి, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఎమోషన్స్ , హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మ్యూజిక్ సినిమాలోని కీలక క్షణాలను మరింత ఇంటెన్స్ గా మార్చింది.