Telangana: పంచాయతీ ఎన్నికల సందడి.. తెలంగాణలో అతిచిన్న గ్రామం, అతిపెద్ద గ్రామం ఎక్కడో తెలుసా ?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.14,17 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద గ్రామం, అతిచిన్న గ్రామం ఏంటో మీకు తెలుసా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. 

New Update
Village in Telangana

Village in Telangana

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.14,17 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎన్నికల కోసం ఏర్పాట్లును ముమ్మరం చేశారు. ఎన్నికలు జరిగే రోజునే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు సర్పంచ్‌గా గెలుస్తారో అనేది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణలో అతిపెద్ద గ్రామం, అతిచిన్న గ్రామం ఏంటో మీకు తెలుసా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. 

అతిపెద్ద గ్రామం

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మేజర్ పంచాయతీ అతిపెద్ద గ్రామంగా నిలిచింది . ఈ ప్రాంతం పంచాయతీతో పాటు మండలకేంద్రంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించిన జాబితా ప్రకారం ఇక్కడ ఏకంగా 40,761 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీలో ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్‌ కేటాయించారు. 20 వార్డుల్లో 5 స్థానాలు ఎస్టీ జనరల్, 5 స్థానాలు ఎస్టీ మహిళ, మరో అయిదు స్థానాలు జనరల్‌, ఇతర 5 స్థానాలు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇక సర్పంచ్ స్థానానికి అయిదుగురు, వార్టుల్లో 75 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 1982లో ఈ పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. 

Also Read: తొలివిడత ఎన్నికలకు అంతా రెడీ.. 395 స‌‌‌ర్పంచ్‌‌‌‌‌‌ స్థానాలు ఏక‌గ్రీవం

2005లో ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినా పలు కారణాల వల్ల రద్దయ్యింది. 2018లో మళ్లీ మున్సిపాలిటీగా మార్చేందుకు యత్నించినా న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 2019లో అక్కడ ఎన్నికలు జరగలేదు. చివరికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రచలం పట్టాణాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం పట్టాణాన్ని ఒకే పంచాయతీగా కొనసాగించింది. అలాగే 14 ఎంపీటీసీ స్థానాలతో తిరిగి మండల కేంద్రంగా కూడా ఏర్పాటు చేసింది. 

Also Read: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు

అతిచిన్న గ్రామం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలనే ఆళ్లపల్లి మండలం అడవిరామారం అనే గ్రామం అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. ఇక్కడ కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 40 మంది మహిళలు, 45 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. అలాగే ఇక్కడున్న నాలుగు వార్డులను కూడా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. ఈ గ్రామానికి డిసెంబర్ 17న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. అడవిరామం అనేది పినపాక నియోజకవర్గంలో ఉంది. ఇది మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.  

Advertisment
తాజా కథనాలు