Telangana Local Body Elections: తొలివిడత ఎన్నికలకు అంతా రెడీ.. 395 స‌‌‌ర్పంచ్‌‌‌‌‌‌ స్థానాలు ఏక‌గ్రీవం

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం ముగిసింది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

New Update
Sarpanch Elections

Sarpanch Elections

Telangana Local Body Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం ముగిసింది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో సర్పంచ్ పదవులకు 13,127 మంది, వార్డు సభ్యుల స్థానాలకు దాదాపు 67,893 మంది పోటీలో ఉన్నారు.  మొద‌‌‌‌టి విడ‌‌‌‌త‌‌‌‌లో జిల్లాలవారీగా పోటీలో ఉన్న స‌‌‌‌ర్పంచ్‌‌‌లు, వార్డు అభ్యర్థుల వివరాలను స్టేట్ ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వెల్లడించింది.  నల్గొండనుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు. కాగా సర్పంచ్‌ ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తులతో జరగక పోయినా గ్రామాల్లో రాజకీయ పార్టీల మద్ధతుతో ఎన్నికలు జరుగుతున్నాయి.‌ కాగా తొలిదశ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 395 చోట్ల సర్పంచ్‌‌‌‌లు ఏకగ్రీవం

తొలి విడత ఎన్నికల్లో  మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 395 చోట్ల సర్పంచ్‌‌‌‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.  మొత్తం 13,127 మంది అభ్యర్థులు తొలి దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విడ‌‌‌‌త‌‌‌‌లో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 149 చోట్ల నామినేషన్లు వేయలేదు. వార్డుల్లోనూ రికార్డు స్థాయిలో 9,331 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. వార్డుల‌‌‌‌కు 67,893 మంది బరిలో  ఉండడం గమనార్హం. నల్గొండ జిల్లా నుంచి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడి ఉన్న జిల్లాల్లో నల్గొండ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 318 పంచాయ‌‌‌‌తీల‌‌‌‌కు 988 మంది బరిలో నిలిచారు.మొద‌‌‌‌టి విడ‌‌‌‌త‌‌‌‌లో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ కోసం వేసిన నామినేషన్లలో  8,095 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 9,626 మంది రేసు నుంచి తప్పుకున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు పోటీ పడిన వారిలో రికార్డు స్థాయిలో 959 మంది విత్ డ్రా చేసుకోగా, వార్డు సభ్యుల స్థానాల నుంచి 1,630 మంది తప్పుకున్నారు.  

కాంగ్రెస్‌‌‌‌ మద్దతుదారులదే జోరు..

తొలి విడ‌‌‌‌త పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో పల్లెపోరులో ప్రచారం జోరందుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.ఎన్ని గ్రామాలు ఏకగ్రీవ‌‌‌‌మ‌‌‌‌య్యాయో లెక్క  తేలింది. ప‌‌‌‌ల్లెల్లో ఏక‌‌‌‌గ్రీవాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు స‌‌‌‌త్తాచాటారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ సపోర్టర్స్​ఎన్నికయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 95 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకోవడం విశేషం. కాగా పంచాయతీ ఎన్నికలను బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటంతో వారిదే హవా కొనసాగుతోంది.     

Also Read :  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్.. ఫస్ట్ రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులు

Advertisment
తాజా కథనాలు