Telangana: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు

రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. రెండ్రోజులకు కలిపి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.

New Update
5.75 lakh crores investments in Telangana Rising Global Summit 2025

5.75 lakh crores investments in Telangana Rising Global Summit 2025

రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. డిసెంబర్ 8, 9 న రెండురోజుల్లో కలిపి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంగళవారం 'తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047' డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.   

కీలక ఒప్పందాలు ఇవే

1.రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వంతో ఇన్‌ఫ్రాకీ పార్క్స్‌ డీల్‌ కుదుర్చుకుంది. మొత్తం 150 ఎకరాల్లో 1గిగావాట్ సామర్థ్యం గల డేటా పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 
2. జెసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది
3. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
4. ఏజీపీ గ్రూప్‌ మొత్తంగా రూ.6,750 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.   
5. బయోలాజికల్-ఈ సంస్థ రూ.3500 కోట్లకు పెట్టుబడులు కుదుర్చుకుంది. పరిశోధన, అభివృద్ధి, తయారీల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. 
6. ఫెర్టిస్ ఇండియా అనే సంస్థ పూ.2 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్, అగ్రికల్చర్ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఈ సంస్ధ పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది.
7. ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌బీ హోల్డింగ్స్‌ సంస్థ రూ.3 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. 
8. ఫుడ్ లింక్ అనే సంస్థ డ్రీమ్‌వాలీ గోల్ఫ్‌ అండ్ రిసార్ట్స్‌ను రూ.1000 కోట్లతో నిర్మించనుంది. 
9. తొలిసారిగా ఫ్లగ్ ఇన్ హైబ్రిడ్ మోటార్‌ బైక్‌ కేంద్రాన్ని రూ.1100 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. 

Also Read: సాధారణ స్థితికి ఇండిగో సేవలు.. సీఈవో సంచలన ప్రకటన

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకామనీగా ఎదగాలనే టార్గెట్ పెట్టుకున్నామన్నారు. యువత, రైతులు, పేదలు, వ్యాపారులు అభివృద్ధి చెందేలా 2047 డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా ఈ విజన్ డాక్యుమెంట్‌ రూపొందించినట్లు పేర్కొన్నారు. 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే తెలంగాణ కూడా లక్ష్యాలు నిర్దేశించుకుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ ముఖ్యమని తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భావించారని తెలిపారు. అందుకే  ఆయన పాలనలో దేశంలో యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించారని తెలిపారు. నెహ్రూ చూపిన మార్గం చిరకాలం అనుసరణీయమైనదని అన్నారు.

మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్‌ సిటీలో భారీగా ఉద్యోగాలు వచ్చేలా మారుస్తామని చెప్పారు. అలాగే నెట్ జీరో కార్బన్‌ సీటాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు నాలుగో న్యూక్లియస్‌గా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 13,500 ఎకరాల్లో గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో లింక్ చేస్తామని.. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. జోన్ల వారీగా విభజిస్తామని అన్నారు. అందులో ఏఐ సిటీ, హెల్త్‌సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్, స్పోర్ట్స్ హబ్, ఎకో టూరిజం, ఎడ్యుకేషన్ జోన్ ఉంటాయని చెప్పారు. 

Also Read: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్..ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, RBI గవర్నర్ దువ్వూరి సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్‌ను రూపొందించారని అన్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండాలని మొదట సీఎం అడిగినప్పుడు వద్దని చెప్పానన్నారు. అప్పటికే టెక్ మహీంద్రా యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండటం వల్ల నో చెప్పానని.. కానీ ఆయన లక్ష్యాలు, విజన్ విన్న తర్వాత తిరస్కరించలేకపోయాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని.. ప్రజలు కేంద్రంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు