JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు

ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చ‌ట్ట ప్రకారం చ‌ర్యలు తీసుకోవాలంటూ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి ఆద్వర్యంలో డీజీపీ జితేంద‌ర్‌ కు విన‌తిప‌త్రం అంద‌చేశారు. 

drer
New Update

TG News : ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజ‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప‌ని చేసే ఉద్యోగుల‌పై దాడులు చేస్తే స‌రైన ప‌ద్దతి కాద‌ంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల‌పై జ‌రిగిన దాడిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించి, దాడికి పాల్పడిన వారిపై చ‌ట్ట ప్రకారం చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి ఆద్వర్యంలో రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ కు విన‌తిప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. అధికారుల‌పై భౌతికంగా దాడి చేసి గాయ‌ప‌ర్చిన‌ప్పుడు నోరు మెద‌ప‌ని వారు.. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తే ఖండించ‌డం ఎంత వ‌ర‌కు స‌రైన‌ద‌ని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగుల‌పై సోమ‌వారం జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. 

Also Read :  పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం!

ఎంత‌టి వారైనా వ‌దిలే ప్రస‌క్తిలేదు..

గ్రామంలో ఫార్మా కంపెనీ విష‌య‌మై ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళ్లిన జిల్లా క‌లెక్టర్‌, అద‌న‌పు క‌లెక్టర్‌, క‌డా ప్రత్యేకాధికారి, త‌హ‌శీల్దార్‌, ఇత‌ర అధికారుల‌పై కొంద‌రు రైతుల ముసుగులో ప‌థ‌కం ప్రకార‌మే దాడి చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంద‌న్నారు. దాడి చేసిన వారిని, దాడి వెనుకాల ఉన్న వారిని గుర్తించి చ‌ట్ట ప్రకారం చ‌ర్యలు తీసుకోవాల‌ని డీజీపీని కోరారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించార‌న్నారు. దాడికి పాల్పడిన వారు ఎంత‌టి వారైనా వ‌దిలే ప్రస‌క్తిలేద‌ని.. పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నట్టుగా డీజీపీ చెప్పార‌ని జేఏసీ నాయ‌కులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Lagcherla: కలెక్టర్ ను అందుకే తరిమికొట్టాం.. RTVతో గ్రామస్తులు ఏమన్నారంటే!

ఈ సంస్కృతిని ఎవ‌రూ స‌హించ‌రు..

అనంత‌రం రాష్ట్ర స‌చివాలయంలోని మీడియా సెంట‌ర్‌లో విలేక‌రుల‌తో ఛైర్మన్ ల‌చ్చిరెడ్డి, ఇత‌ర నాయ‌కులు మాట్లాడారు. జిల్లా క‌లెక్టర్‌నే గ్రామానికి వ‌చ్చిన‌ప్పుడు త‌మ అభిప్రాయాన్ని రైతులు, గ్రామ‌స్తులు స్వేచ్ఛగా చెప్పుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. కానీ అదే క‌లెక్టర్ ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తించ‌డం, మిగ‌తా అధికారుల‌పై భౌతిక‌దాడుల‌కు దిగ‌డం, వాహ‌నాల‌ను ధ్వంసం చేయ‌డం స‌రైన ప‌ద్దతి కాద‌న్నారు. అధికారుల‌పై భౌతిక దాడులు చేసే సంస్కృతిని ఎవ‌రూ కూడా స‌హించ‌ర‌న్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయ‌కులు కె.రామ‌కృష్ణ, ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌రల్ ఫూల్‌సింగ్ చౌహాన్‌, రాధ‌, తెలంగాణ నిర్మల‌, చంద్రశేఖ‌ర్‌గౌడ్‌, రాబ‌ర్ట్ బ్రూస్‌, పుష్పల‌త‌, తిరుప‌తి, విజ‌య్‌కుమార్‌, హ‌రీంద‌ర్‌సింగ్‌, త‌దిత‌రు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మీ తల్లిని చపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

Also Read :  హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్

#dgp #kodangal #jac
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe