Lagcherla: కలెక్టర్ ను అందుకే తరిమికొట్టాం.. RTVతో గ్రామస్తులు ఏమన్నారంటే!

కలెక్టర్, తహసీల్దార్, ప్రభుత్వ అధికారులపై చేసిన దాడిని వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు సమర్ధించుకుంటున్నారు. వారంతా ప్రభుత్వ అధికారులని తమకు తెలియదంటున్నారు. మరోవైపు ఫార్మా కంపెనీ కోసం ప్రాణాలు పోయినా తమ పొలాలను వదులుకోమంటున్నారు. 

New Update
fdfd

Kodangal : కలెక్టర్, తహసీల్దార్, ప్రభుత్వ అధికారులపై చేసిన దాడిని వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు సమర్ధించుకుంటున్నారు. నిజంగా వాళ్లు ప్రభుత్వ అధికారులని తమకు తెలియదని, ఎవరో అనుకుని దాడి చేసినట్లు చెబుతున్నారు. అయితే ఫార్మా కంపెనీ కోసం ప్రాణాలు పోయినా మా పొలాలను వదులుకోమంటున్నారు. 

ఇది కూడా చదవండి :  Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు

కలెక్టర్ అని మాకు తెలియదు..

ఈ మేరకు మంగళవారం RTVతో మాట్లాడిన లగచర్ల గ్రామస్థులు.. జిల్లా కలెక్టర్ అని మాకు తెలియదు. అధికారులను కొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. మమ్మల్ని గ్రామంలో నుంచి బయటకు వెళ్లనీయలేదు. గ్రామం చుట్టూ పోలీసులు పహారా కాశారు. ఫార్మసిటిలో ప్రాణంగా చూసుకుంటున్న భూమిని కోల్పోతాం. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వెళ్లాలన్నారు. కానీ మేము ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా.. గ్రామంలోనే వంటావార్పు చేసుకుని ఉందామనుకున్నామని చెప్పారు. 

ఇది కూడా చదవండిAP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు!

ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి..

అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా అధికారుల వాహనాలు గ్రామంలోకి రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లామని గ్రామస్థులు తెలిపారు. ఇక వ్యవసాయాన్ని జీవనాధారంగా నమ్ముకుని బతుకుతున్న భూమిని ఎలా వదులుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. కానీ రోడ్డున పడుతామనుకోలేదంటూ ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చదవండి :  Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

ఇది కూడా చదవండి :  Formula E race: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే!

Advertisment
తాజా కథనాలు