పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం!

లగచర్లలో నిన్న కలెక్టర్, అధికారులపై దాడులు జరగడంపై మంత్రి శ్రీధర్ బాబు పోలీసులపై సీరియస్ అయ్యారు. వారం నుంచి సురేష్ అనే వ్యక్తి గ్రామస్తులతో మీటింగ్ పెడుతుంటే ఏం చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులను రెచ్చగొట్టింది BRS పార్టీనేనని ఆరోపించారు.

New Update
Duddilla Sridhar Babu

రేవంత్ నియోజకవర్గంలోని లగచర్లలో నిన్న కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి జరిగిన ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు పోలీసు అధికారులతో మంత్రి శ్రీధర్‌ బాబు సమావేశం అయ్యారు. ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని శ్రీధర్ బాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. వారం నుంచే సురేష్‌ లగచర్ల గ్రామస్థులతో భేటీ అవుతుంటే ఏం చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!

కుట్రలు చేసింది బీఆర్ఎసే..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటిందని.. ఈ పది నెలలుగా ఇచ్చిన  హామీలను అమలు చేస్తూ, అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. లగుచర్ల గ్రామస్థులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి ఫార్మా పరిశ్రమ వస్తే 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 

ఇది కూడా చదవండి: Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది?

అసలేమైందంటే?

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని దుద్యాల మండలం, లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో సోమవారం గ్రామసభలో పాల్గొనడానికి కలెక్టర్, ఇతర అధికారులు గ్రామానికి వచ్చారు. వచ్చిన వారిలో వికారాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవిన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ సమయంలో కలెక్టర్ తో పాటు అధికారులపై కొందరు గ్రామస్తులు దాడులు చేశారు. పలువురు అధికారుల వాహనాలపై సైతం దాడులు చేశారు. ఇది సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం నిందితులు, వీరిని రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు