Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!

లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update

 Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..

పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని  పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

 cheating | producer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు